భారత వాయుసేనకు ప్రత్యేకమైన ఉపగ్రహ కమ్యూనికేషన్ సామర్థ్యంతోపాటు, నౌకాదళానికి భారీ టార్పిడోలు సమకూర్చుకునేందుకు సంబంధించి రెండు ప్రభుత్వ రంగ సంస్థలతో రక్షణ శాఖ రూ.4,106 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. వాయుసేన కమ్యూనికేషన్ల కోసం ప్రత్యేకించి జీశాట్ - 7 సీ ఏర్పాటుకు బెంగుళూరుకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో రూ. 2,563 కోట్ల కాంట్రాక్టుపై సంతకాలు జరిగాయి.