మన దేశంలో 2014లో నమోదిత స్పేస్ టెక్ అంకురం ఒకటి ఉండగా.. 2026 ఆగస్టుకు వీటి సంఖ్య 440కి చేరిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (ఇన్‌స్పేస్) ఇప్పటిదాకా 52 ప్రైవేటు సంస్థలకు 113 అనుమతులు ఇచ్చింది. 2026, మార్చి 31 నాటికి భారత అంతరిక్ష అంకురాల్లోకి 618.5 మి. డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 9 బి.డాలర్లు (సుమారు రూ.86,400 కోట్లు)గా ఉంది. 2033 కల్లా 44 బిలియన్ డాలర్లకు చేరేలా ఇన్-స్పేస్ దీర్ఘకాల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో 11 బి.డాలర్ల ఎగుమతుల లక్ష్యమూ ఉంది.