జీజీహెచ్‌ వైద్యుల అరుదైన ఆవిష్కరణ

జీజీహెచ్‌ వైద్యుల అరుదైన ఆవిష్కరణ
  • అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సురక్షితంగా నిర్వహించడానికి గుంటూరు జీజీహెచ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అంతర్జాతీయ వైద్య పరిశోధనా పత్రిక ‘స్ప్రింగర్‌ నేచర్‌’లో ఈ పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది. గతంలో శస్త్రచికిత్సలు జరిగిన, తీవ్రమైన రేడియేషన్‌కు గురైన భాగాలు లేదా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రదేశాల్లో శరీర కణజాల నిర్మాణం పూర్తిగా మారిపోతుంది.

  • ఇలాంటి ‘హోస్టైల్‌ సర్జికల్‌ ఫీల్డ్స్‌లో శస్త్రచికిత్స చేయడం సర్జన్లకు సవాల్‌గా మారుతుంది. పాత గాయాల వల్ల ఏర్పడే కణజాల పొరలు, సున్నితమైన రక్తనాళాలు, నరాలు ఒకదానికొకటి గట్టిగా అతుక్కుపోతాయి. ఈ ప్రదేశాల్లో సాధారణ కత్తెర్లు లేదా పదునైన బ్లేడ్లు ఉపయోగిస్తే కీలకమైన రక్తనాళాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. ఎలక్ట్రోకాటరీ పరికరాలను ఉపయోగిస్తే కణజాలాలు కాలిన గాయాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram