కేరళం కేంద్రంగా పనిచేసే మెరైన్ రోబోటిక్స్, ఏఐ డీప్‌టెక్ అంకుర సంస్థ ఐరోవ్, భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి దేశీయ మిలటరీ-గ్రేడ్ అండర్‌వాటర్ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ ‘ఐరోవ్ ట్రౌట్’ను 2026, అక్టోబరు 7న అధికారికంగా అందజేసింది.
భారత నేవీ ఇచ్చిన మొత్తం 5 ట్రౌట్ వ్యవస్థల ఆర్డర్‌లో భాగంగా తొలి విడతగా రెండు వ్యవస్థను విజయవంతంగా డెలివరీ చేసింది. కమర్షియల్ అండర్‌వాటర్ డ్రోన్‌లతో పోలిస్తే దీన్ని అత్యంత కఠినమైన మిలటరీ ప్రమాణాలతో రూపొందించారు.