ప్రభుత్వ రంగ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), సాయుధ వాహనాలకు తేలికపాటి బుల్లెట్‌ఫ్రూఫ్ గ్లాస్‌ను అభివృద్ధి చేయడం కోసం సీఎస్‌ఐఆర్-సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీజీసీఆర్‌ఐ)తో ఒప్పందం చేసుకుంది.
దేశీయంగా అధునాతన, తేలికపాటి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్‌ను అభివృద్ధి చేసే రూ.50 కోట్ల ప్రాజెక్టులో సీజీసీఆర్‌ఐ సాంకేతిక భాగస్వామిగా ఉంటుంది. ఇది నాలుగేళ్ల ప్రాజెక్టు. మహారాష్ట్రలోని నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ (ఎన్‌ఎమ్‌ఆర్‌ఎల్), చండీగఢ్‌లోని టీబీఆర్‌ఎల్ వంటి డీఆర్‌డీఓ లేబొరేటరీలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటాయి.