తొలిసారి భూకక్ష్యలోకి స్టార్‌షిప్‌

తొలిసారి భూకక్ష్యలోకి స్టార్‌షిప్‌
  • ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థ తన భారీ రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ను తొలిసారి భూకక్ష్యలోకి పంపింది. 40 అంతస్తుల ఎత్తయిన ఈ మానవరహిత రాకెట్‌ స్టార్‌లింక్‌కు సంబంధించిన 26 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఒక ఇంజిన్‌ అర్ధాంతరంగా మొరాయించినప్పటికీ అది ఈ విజయాన్ని సాధించింది.

  • చందమామపైకి అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా తలపెట్టిన ఆర్టెమిస్‌ మిషన్‌కు ముందు ఈ రాకెట్‌ సన్నద్ధతను ధ్రువీకరించడం ఈ ప్రయోగం ఉద్దేశం. 2026, సెప్టెంబరు 28న అమెరికాలోని టెక్సాస్‌ తీరం నుంచి ‘స్టార్‌షిప్‌’ నింగిలోకి దూసుకెళ్లింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram