ఒడిశాలో తాము నిర్వహిస్తున్న ధమ్రా నౌకాశ్రయం, పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌తో పని చేసే భారతదేశపు తొలి పెద్ద స్థాయి ప్రైవేటు మల్టీ కార్గో పోర్ట్‌గా నిలిచిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) తెలిపింది. ఏటా 48 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరకును ఈ నౌకాశ్రయం రవాణా చేస్తోంది. ఇక్కడ నెలవారీ విద్యుత్ వినియోగం 90 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ. ఏడాదికి 108 గిగావాట్ అవర్ల కంటే ఎక్కువ. కాలుష్య ఉద్గారాలు తగ్గించడమే తమ ధ్యేయమని సంస్థ పేర్కొంది.