సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు లుటెటియం మూలకంతో తయారు చేసిన ఒక అటామిక్ గడియారాన్ని రూపొందించారు. రికార్డు స్థాయి కచ్చితత్వంతో సెకనులో లక్ష కోట్లవ వంతును తమ గడియారం కొలవగలదని వారు పేర్కొన్నారు. ఉష్ణోగ్రత లేదా అయస్కాంత క్షేత్రంలో మార్పుల ప్రభావానికి లోనుకాకుండా అన్ని వాతావరణాల్లోనూ అత్యంత స్థిరమైన సమయాన్ని అందించగలదని వారు తెలిపారు.
1955లో మొట్టమొదటి కచ్చితమైన అటామిక్ గడియారాన్ని తయారు చేయడానికి సీసియం మూలక పరమాణువులను ఉపయోగించారు.