భారత వైమానిక దళం అవసరాల కోసం 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ (సాట్-సావ్) ఆయుధాలను సరఫరా చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) రూ.810.79 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థ అయిన బీడీఎల్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో 2026, సెప్టెంబరు 23న ఈ ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు.