క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌

క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌
  • హ్యాకింగ్, ట్యాపింగ్‌ వంటివాటికి ఆస్కారంలేకుండా, భద్రమైన కమ్యూనికేషన్‌ సాకారం దిశగా భారత్‌ పురోగతి సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో వెయ్యి కిలోమీటర్ల క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని సాధించింది. తద్వారా ప్రయోగాల దశ నుంచి భారీ, క్రియాశీల నెట్‌వర్క్‌ను నిర్మించే స్థాయికి మన దేశం ఎదిగిందని స్పష్టమవుతోంది. ఈ రంగంలో దూసుకెళుతున్న చైనాకు దీటుగా అవతరిస్తోంది.
  • క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌.. సమాచారాన్ని భద్రంగా బట్వాడా చేయడానికి ఉపయోగపడే అద్భుత విధానం. ఇందులో ప్రధానంగా ఫోటాన్ల ద్వారా కమ్యూనికేషన్‌ సాగుతుంది. ఈ క్రమంలో ఎంటాంగిల్‌మెంట్, సూపర్‌ ఇంపోజిషన్‌ వంటి క్వాంటమ్‌ మెకానిక్స్‌ విధానాలను ఉపయోగిస్తారు. సమాచార గోప్యతను కాపాడేందుకు క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌ (క్యూకేడీ) విధానాన్ని ఉపయోగిస్తారు. 
  • 2024-25లో రూ.6వేల కోట్లతో భారత ప్రభుత్వం జాతీయ క్వాంటమ్‌ మిషన్‌ను ప్రారంభించింది. 8 ఏళ్లలో 2వేల కిలోమీటర్ల పొడవైన క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను సాకారం చేయాలన్నది దీని లక్ష్యం. రెండేళ్లలోనే వెయ్యి కిలోమీటర్ల లక్ష్యం నెరవేరింది. 2027 నాటికే.. ఎంతో ముందుగా మిగతా వెయ్యి కిలోమీటర్ల నెట్‌వర్క్‌ సాకారం కానుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram