అడవికి నిప్పంటిస్తే మరణశిక్ష

అడవికి నిప్పంటిస్తే మరణశిక్ష

అడవికి నిప్పంటించే వారికి మరణశిక్ష విధించేందుకు వీలు కల్పించే బిల్లుకు అల్జీరియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 307 ఓట్లు రాగా వ్యతిరేకంగా 17 మంది ఓటు వేశారు. 1993 నుంచీ అల్జీరియా ఒక్క మరణశిక్షనూ అమలు చేయపోయినప్పటికీ కోర్టులు మాత్రం మరణ దండన విధిస్తూనే ఉన్నాయి. దేశంలోని విస్తృత భూభాగాన్ని నాశనం చేస్తున్న కార్చిచ్చులకు బాధ్యులైనవారు మరణశిక్ష ఎదుర్కోక తప్పదు అని దేశాధ్యక్షుడు అబ్దెల్‌మజీద్‌ టెబ్బూన్‌ అన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram