ఆకస్‌ కూటమి

ఆకస్‌ కూటమి
  • సముద్రగర్భ కేబుళ్లను రక్షించడానికి, రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అండర్‌ వాటర్‌ డ్రోన్లను అభివృద్ధి చేయాలని ఆకస్‌ కూటమి (అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా) నిర్ణయించింది. సింగపూర్‌లో జరుగుతున్న భద్రతా సదస్సులో ఈ మూడు దేశాల రక్షణ మంత్రులు 2026, మే 30న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మానవరహిత వాహనాన్ని 2027 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చును ప్రకటించనప్పటికీ, బ్రిటన్‌ రక్షణ మంత్రి జాన్‌ హీలీ తమ దేశం తరపున 201 మిలియన్ల డాలర్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.  ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో, దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక శక్తిని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా ఆకస్‌ కూటమి 2021లో ఏర్పడింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram