జగిత్యాల జిల్లా మహిళా రైతుకు జాతీయ అవార్డు

జగిత్యాల జిల్లా మహిళా రైతుకు జాతీయ అవార్డు

మహిళా రైతులను ప్రోత్సహించడంలో భాగంగా ఏటా జాతీయ స్థాయిలో అందించే ‘మహిళా కిసాన్‌ దివస్‌’ అవార్డుకు.. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం పెంబట్లకు చెందిన బండారి విజయ ఎంపికయ్యారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఏటా అక్టోబరు 15న ఈ అవార్డును అందిస్తున్నారు. విభిన్న పద్ధతుల సాగు, సేంద్రియ వ్యవసాయం, తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులతో పాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తుండగా.. విజయ ఎకరం విస్తీర్ణంలో 14 రకాల కూరగాయల పెంపకం చేపట్టడం, అంతర పంటలతో అదనపు ఆదాయంతో పాటు పలు విభిన్న పద్ధతుల్లో సాగు విధానాన్ని అవలంబిస్తూ ఆదర్శంగా నిలిచారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram