విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ టాప్‌

విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ టాప్‌
  • విద్యుత్‌ వినియోగం వృద్ధిరేటులో 2026, ఏప్రిల్‌ నెలలో 20.5 శాతం పెరుగుదలతో దేశంలో తెలంగాణ నంబర్‌వన్‌ ర్యాంకులో నిలిచింది. దీని తరువాత బిహార్‌ 20.1, కర్ణాటక 19, ఏపీ 11.9 శాతాలతో వరుసగా 2, 3, 4 ర్యాంకుల్లో ఉన్నాయి. జాతీయ వృద్ధిరేటు 3.7 శాతంతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో పెరుగుదల చాలా ఎక్కువని కేంద్ర విద్యుత్‌ మండలి (సీఈఏ) తాజా నివేదికలో వెల్లడించింది.
  • 2025 ఏప్రిల్‌లో తెలంగాణలో 7,430 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) కరెంటు వినియోగమవగా.. 2026 ఏప్రిల్‌లో 20.5 శాతం పెరిగి 8,953 ఎంయూకు చేరింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, నిర్మాణ రంగం, ఆర్థికాభివృద్ధి కారణంగా విద్యుత్‌ డిమాండు రికార్డుస్థాయిలో పెరుగుతోందని అంచనా. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram