తెలంగాణకు రూ.3,825.31 కోట్లు 

తెలంగాణకు రూ.3,825.31 కోట్లు 
  • కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో 2026, జులై 1 నుంచి అమలు చేయనున్న జీరాంజీ పథకం కింద తెలంగాణకు రూ.3,825.31 కోట్లను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 2026, జూన్‌ 9న ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది నెలల గడువు ఉండగా... కొత్త నిబంధనలను అనుసరించి జీరాంజీలో ఇకపై కొనసాగున్న తమ వాటా 60% కింద ఈ మేరకు నిధులను కేటాయించింది. వచ్చే 9 నెలల కోసం రాష్ట్రంలో జీరాంజీ కింద మొత్తం రూ.6,375.52 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram