డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్‌ ప్రవేశాలు

డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్‌ ప్రవేశాలు

విజయవాడలోని డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి. (నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి. (నర్సింగ్) 2-సంవత్సరాల డిగ్రీ కోర్సు ప్రవేశాలు 2026-27.

అర్హత: అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందిన ఇంటర్‌ (10+2) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు, ఏపి ప్రభుత్వం లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) కోర్సు పూర్తి చేసి, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. (గమనిక: 12 సంవత్సరాల ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చదివిన వారు ఈ కోర్సుకు అర్హులు కారు.)

వయోపరిమితి: 31 డిసెంబర్ 2026 నాటికి అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 15.09.2026.

Website: https://drntr.uhsap.in/index/notification_admission

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram