జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు

జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఏయూ) 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాలు టీజీ పాలీసెట్‌ (TG-POLYCET-2026) ఎంబైపీసీ (MBiPC) స్ట్రీమ్ ర్యాంకుల ఆధారంగా నిర్వహిస్తారు.  

వివరాలు: 

డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (రెండేళ్లు): మొత్తం 530 సీట్లు

యూనివర్సిటీ పాలీటెక్నిక్‌: 350 సీట్లు

అఫిలియేటెడ్‌ పాలీటెక్నిక్స్‌: 180 సీట్లు

డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ (మూడేళ్లు): మొత్తం 50 సీట్లు

యూనివర్సిటీ పాలీటెక్నిక్స్‌: 20 సీట్లు

అఫిలియేటెడ్‌ పాలీటెక్నిక్‌: 30 సీట్లు

మొత్తం సీట్ల సంఖ్య: 580.

అర్హతలు: తప్పనిసరిగా టజీ పాలీసెట్‌-2026లో ఎంబైపీసీ స్ట్రీమ్‌లో హాజరై ఉండాలి. అదేవిధంగా కనీసం 35% మార్కులతో తెలంగాణ ఎస్‌ఎస్‌సీ లేదా సమానమైన పరీక్ష (CBSE, ICSE, NIOS, TOSS తదితర బోర్డులు)లో సైన్స్ సబ్జెక్ట్‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మొత్తం సీట్లలో 60% సీట్లు గ్రామీణ ప్రాంతాలు/ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, మహిళలకు ప్రతి కోర్సులో 33⅓% హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్యూఎస్‌ కేటగిరీకి 10% సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్‌ కేటగిరీలకు ప్రత్యేక రిజర్వేషన్లు లభిస్తాయి.

వయోపరిమితి: 31.12.2026 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అనంతరం దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేసి అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.600; ఇతరులకు రూ.1,200.

ముఖ్య తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: 10.06.2026.

రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 28.06.2026.

దరఖాస్తు చివరి తేదీ: 29.06.2026.

దరఖాస్తు సవరణ: 30.06.2026.

Website:https://diploma.pjtau.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram