నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ (ఎన్‌ఎస్‌యూ), ఇంఫాల్, మణిపూర్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్  కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులలో ప్రవేశాలు నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎస్‌యూఈఈ), ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, గేమ్ ప్రొఫిషియన్సీ, వైవా-వోస్ ఆధారంగా ఉంటాయి. 

వివరాలు: 

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ- యూజీ, పీజీ 2026-27 ప్రవేశాలు

కోర్సులు: 

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (స్పోర్ట్స్ కోచింగ్) : 50 సీట్లు

మాస్టర్‌ ఆఫ్ సైన్స్ (స్పోర్ట్స్ కోచింగ్): 20 సీట్లు

బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(B.P.E.S): 50 సీట్లు

మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(B.P.E.S): 30 సీట్లు

మాస్టర్ ఆఫ్ సైన్స్ (స్పోర్ట్స్ సైకాలజీ): 15 సీట్లు

మాస్టర్ ఆఫ్ సైన్స్ (అప్లైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్): 15 సీట్లు

వ్యవధి: యూజీ కోర్సులు మూడు, నాలుగేళ్లు; పీజీ కోర్సులు రెండేళ్లు.

విభాగాలు: స్పోర్ట్స్ కోచింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ ఫిజియాలజీ & న్యూట్రిషన్‌.
అందుబాటులో ఉన్న క్రీడలు(బ్యాచిలర్‌, మాస్టర్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌): ఆర్చరీ, అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాక్సింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వుషు.

అర్హతలు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు (బీఎస్సీ, బీపీఈఎస్) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీఎస్సీ (స్పోర్ట్స్ కోచింగ్) కోసం అభ్యర్థులు నిర్దేశిత క్రీడలలో జిల్లా/జోనల్/జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొన్న సర్టిఫికేట్ కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం సంబంధిత సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు కనీసం 50% మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీసం 45% మార్కులు అర్హత పరీక్షలో వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం: స్పోర్ట్స్ యూనివర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NSUEE), ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, గేమ్ ప్రొఫిషియన్సీ, వైవా-వోస్ ఆధారంగా ఉంటాయి.

దరదరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.  

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.06.2026.

పరీక్ష తేదీ: 14.07.2026.

ఫిజికల్‌ ఫిట్‌నెట్‌ అండ్‌ గేమ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌: జులై 15-17.

ఫలితాలు: జులై 27.  

Website:https://www.nsu.ac.in/admission

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram