ఐజీఐఎంఎస్ పట్నాలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఐజీఐఎంఎస్ పట్నాలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్‌), పట్నా తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • సీనియర్ రెసిడెంట్ - 06

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎండీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 03/11/2026 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఈబీసీ/బీసీ, అన్ని వర్గాల మహిళా అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ,ఎస్టీ,ఈబీసీ అభ్యర్థులకు రూ.250.

ఇంటర్వ్యూ తేదీ: 2026 నవంబరు 4.

వేదిక: పీడియాట్రిక్స్ సెమినార్ రూమ్, 5వ తల, మెడికల్ కాలేజ్ బిల్డింగ్, ఐ.జి.ఐ.ఎం.ఎస్., పట్నా-14, బిహార్

Website:http://www.igims.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram