ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో  సివిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో  సివిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని (ఉమ్మడి) డీసీహెచ్‌ఎస్ పరిధిలో ఉన్న సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 19

వివరాలు:

1. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్

2. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్)

విభాగాలు: సీఏఎస్ అనస్థీషియా, సీఏఎస్ జనరల్ మెడిసిన్,  సీఏఎస్ జనరల్ మెడిసిన్, సీఏఎస్ రేడియాలజీ, సీఏఎస్ గైనకాలజీ,  సీఏఎస్ జనరల్ సర్జరీ, సీఏఎస్ ఎంబీబీఎస్ జనరల్.  

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఎంబీబీఎస్‌/డీఎన్‌బీ/మెడికల్ పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో ప్రస్తుత చెల్లుబాటుతో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.  

వేతనం: నెలకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌కు రూ.1,10,000, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్‌కు రూ.61,960,

గరిష్ఠ వయోపరిమితి: 01.07.2026 నాటికి ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు; ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు; పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు  52 ఏళ్లు మించకూడదు.  

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్‌ 18. 

వేదిక: జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త కార్యాలయం (DCHS ఆఫీస్), ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)ఆవరణ, మొదటి అంతస్తు, కాంటోన్మెంట్, మచిలీపట్నం.  

Website: https://krishna.ap.gov.in/notice_category/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram