ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) దేశవ్యాప్తంగా వివిధ బిజినెస్ వర్టికల్స్‌లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు ప్రాథమికంగా ఒక సంవత్సరం కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి, ప్రాజెక్ట్ అవసరాలు, అభ్యర్థి పనితీరు ఆధారంగా వీటిని నాలుగు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు:

ప్రాజెక్ట్ ఇంజినీర్ ఆన్ కాంట్రాక్ట్ (PE-C), టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ (TO-C), అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఆన్ కాంట్రాక్ట్ (APE-C) & సీనియర్ ఆర్టిసాన్ ఆన్ కాంట్రాక్ట్ (SA-C) పోస్టులు ఉన్నాయి.

1. హైదరాబాద్ (హెడ్‌క్వార్టర్స్): 5

2. ముంబయి (వెస్ట్ జోన్): 5

3. చెన్నై (సౌత్ జోన్): 1

4. కోల్‌కతా (ఈస్ట్ జోన్): 1 

5. న్యూదిల్లీ (నార్త్ జోన్): 9  

విద్యార్హతలు: 

ప్రాజెక్ట్ ఇంజినీర్ అండ్‌ టెక్నికల్ ఆఫీసర్: కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.  

అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: కనీసం 60% మార్కులతో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.  

సీనియర్ ఆర్టిసాన్: ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి.  

అనుభవం: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు 3 ఏళ్ల అనుభవం, టెక్నికల్ ఆఫీసర్ & అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 1 సంవత్సరం అనుభవం, సీనియర్ ఆర్టిసాన్ పోస్టుకు 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. (సంబంధిత రంగంలో చేసిన అప్రెంటిస్‌షిప్‌ను కూడా అనుభవంగా పరిగణిస్తారు).  

వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు 33 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు వయోపరిమితిగా నిర్ణయించారు. ఓబీసీ (OBC) అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు అదనంగా 10 ఏళ్లు & జమ్మూ & కశ్మీర్ వాసులకు 5 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.  

జీతం: సంవత్సరానికి ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు (ఏడాదిని బట్టి పెరుగుతుంది). టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000 వరకు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు నెలకు రూ.26,208. సీనియర్ ఆర్టిసాన్ కు నెలకు రూ.24,018.  

దరఖాస్తు విధానం & తేదీలు:

దరఖాస్తు ఫారమ్‌ను ఈసీఐఎల్ వెబ్‌సైట్ (www.ecil.co.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. 

ఎంపిక ప్రక్రియ & పరీక్ష విధానం:

అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో విద్యార్హత (20%), సంబంధిత అనుభవం (30%) & పర్సనల్ ఇంటర్వ్యూ (50%) మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 

ఇంటర్వ్యూ తేదీలు: 2026, జూన్ 15, 18, 19.

వేదిక: హైదరాబాద్, ముంబయి, న్యూదిల్లీ, కోల్‌కతా & చెన్నైలలో వాక్-ఇన్ కేంద్రాలు ఉన్నాయి.

Website: https://www.ecil.co.in/jobopenings

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram