ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

చెన్నైలోని ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) ఒప్పంద ప్రాతిపదికిన టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు: 

1. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ (డిప్లొమా): 08

2. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌: 22

శిక్షణ వ్యవధి: ఏడాది.

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కామర్స్‌, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌, బీఎస్సీ, బీఈ/బీకాం ఉత్తీర్ణత ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.12,000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.13,000.

వయోపరిమితి: డిప్లొమా టెక్నీషియన్స్‌కు 18 నుంచి 24 ఏళ్లు; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎన్‌ఏటీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

ఇంటర్వ్యూ తేదీ: 10-06-2026.

వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ, చెన్నై.

Website:https://www.nio.res.in/vacancies/temporary

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram