హైదరాబాద్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఇమరాట్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఇమరాట్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

హైదరాబాదులోని డిఆర్‌డీఓకు చెందిన రిసెర్చ్‌ సెంటర్‌ ఇమరాట్‌.. ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు పెయిడ్‌ ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటించింది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 160 

వివరాలు:

1. అండర్ గ్రాడ్యుయేట్ (బీటెక్‌ VII & VIII సెమిస్టర్)

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంటెక్‌/ ఎంఎస్సీ 2వ సంవత్సరం)

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE), ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ / ఈసీఈ/ఈఐఈ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ / కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఈసీఈ, సీఎస్‌ఈ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఐఆర్‌ సీకర్స్‌, వీఎల్‌ఎస్‌ఎల్‌ అండ్‌ ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, రోబోటిక్స్‌ తదితరాలు

అర్హత: అభ్యర్థులు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో ఫుల్‌టైం కోర్సులో చదువుతూ ఉండాలి. బీటెక్‌ చివరి సంవత్సరం (VII/VIII సెమిస్టర్) లేదా ఎంటెక్‌/ఎంఎస్సీ రెండవ సంవత్సరం విద్యార్థులు మాత్రమే అర్హులు. కనీసం 75% మార్కులు లేదా సమానమైన సీజీపీఏ ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతల మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్‌, రిసెర్చ్‌ సెంటర్ ఇమరాట్‌, డిఫెన్స్‌ ఆర్‌ అండ్‌ డీ ఆర్గనైజేషన్‌, విజ్ఞాన కంచ, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 20.06.2026.

ఎంపికైన అభ్యర్థులకు సమాచారం: జులై 2026 రెండో వారం

ఇంటర్న్‌షిప్ ప్రారంభం: 03.08.2026

Website:https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram