బీడీఎల్ సంగారెడ్డి జిల్లాలో ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాలు

బీడీఎల్ సంగారెడ్డి జిల్లాలో ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న కేటగిరీ-1 ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌), తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా భానూర్ యూనిట్‌లో 2026-27 సంవత్సరానికి గాను అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ప్రకటన విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 134

వివరాలు:

  1. ఫిట్టర్ - 35

  2. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 30

  3. మెషినిస్ట్ - 09

  4. మెషినిస్ట్ - 03

  5. వెల్డర్ - 06

  6. మెకానిక్ డీజిల్ - 04

  7. ఎలక్ట్రీషియన్ - 11

  8. టర్నర్ -08

  9. కోపా -22

  10. ప్లంబర్ - 01

  11. మెకానిక్ - 01

  12. కెమికల్ ల్యాబ్ - 03

  13. ఎంఎంవి- 01

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి / ఎస్ఎస్‌సి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.

వయోపరిమితి: కనిష్టంగా 14 సంవత్సరాలు, గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా (www.apprenticeshipindia.gov.in)

దరఖాస్తు చివరి తేదీ: 30-11-2026

Website: https://bdl-india.in/apprentice-connect

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram