కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు

కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వం, కేరళ ప్రభుత్వ సంయుక్త రంగ సంస్థ, కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్‌ఎల్‌), అప్రెంటిస్ చట్టం 1961 కింద వివిధ విభాగాలలో ఏడాది కాలపరిమితితో అప్రెంటిస్షిప్ శిక్షణను అందించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టులు: 70

వివరాలు:

  • గ్రాడ్యుయేట్ టెక్నికల్ అప్రెంటిస్- 16

  • గ్రాడ్యుయేట్ నాన్-టెక్నికల్ అప్రెంటిస్- 06

  • డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్- 28

  • ట్రేడ్ అప్రెంటిస్ - ఐటీఐ- 20

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఏ/బీకాం/బీసీఏ/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 ఏళ్లు నిండి ఉండాలి.

నెలవారీ స్టైపెండ్ : రూ.9,600 నుంచి రూ.12,300 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 10-11-2026.

దరఖాస్తు ప్రక్రియ: పోస్టు ద్వారా

చిరునామా: జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్‌, ఏడీఎంఎన్‌& టీఆర్‌జీ) కోచి మెట్రో రైల్ ల్టీడ్., కార్పొరేట్ ఆఫీస్, ౪త్ ఫ్లోర్, జేఎల్‌ఎన్‌ స్టేడియం మెట్రో స్టేషన్, క్లూర్, కోచి, కేరళ

Website: https://kochimetro.org/careers/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram