ఎయిమ్స్‌ దేవ్‌గఢ్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్‌ దేవ్‌గఢ్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), దేవ్‌గఢ్ (జార్ఖండ్) వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడెమిక్) పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారత ప్రభుత్వ రెసిడెన్సీ స్కీమ్ 1992 ప్రకారం ప్రాథమికంగా ఏడాది కాలానికి ఈ నియామకాలు చేపడతారు.

వివరాలు:

సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడెమిక్): 159 పోస్టులు

విభాగాలు: అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, అబ్స్టెట్రిక్స్ & గైనకాలజీ, రేడియో డయాగ్నోసిస్, ఆర్థోపెడిక్స్, పల్మనరీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనాటాలజీ తదితరాలు...

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. బ్రాడ్ స్పెషాలిటీలలో డీఎన్‌బీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఎండీ/ఎంఎస్‌ తో సమానమైన గుర్తింపు పత్రాన్ని సమర్పించాలి.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 45 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ sr.recruitment@aiimsdeoghar.edu.in ద్వారా

దరఖాస్తు రుసుము: యూఆర్‌ అభ్యర్థులకు: రూ. 3,000/-
ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు: రూ. 1,000/- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు: ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తు చివరి తేదీ: 05-12-2026

Website: https://www.aiimsdeoghar.edu.in/recruitments/list

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram