ఇస్రో- ఎస్‌డీఎస్‌సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఇస్రో- ఎస్‌డీఎస్‌సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో పనిచేస్తున్న 'సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట (ఎస్‌డీఎస్‌ ఎస్‌హెచ్‌ఏఆర్‌)లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టులు: 79

వివరాలు:

  • టెక్నికల్ అసిస్టెంట్-07

  • టెక్నీషియన్ 'బి'- 16

  • సైంటిఫిక్ అసిస్టెంట్- 02

  • లైబ్రరీ అసిస్టెంట్ 'ఎ- 03
    మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 16

  • ఇతర ఖాళీలు: 35
    *నర్స్ 'బి'- 03

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు/సంస్థ నుంచి పోస్టును బట్టి టెన్త్‌/ట్రేడ్‌ ఐటీఐ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత.

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ. 1,42,400. వరకు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: పోస్ట్ కోడ్ 07 నుంచి 15 వరకు: రూ. 750/- ప్రాసెసింగ్ ఫీజు.
పోస్ట్ కోడ్ 16 నుంచి 30 వరకు: రూ. 500/- ప్రాసెసింగ్ ఫీజు (రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫీజు రీఫండ్ చేస్తారు).

వయోపరిమితి: 18 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ నమోదు ప్రారంభ తేదీ: 19.10.2026

ఆన్‌లైన్ నమోదుకు చివరి తేదీ: 09.11.2026.

Website: https://www.isro.gov.in/SDSCRecruitment26.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram