ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌) రెగ్యులర్ ప్రాతిపదికన అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 109

వివరాలు:

  1. అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్ II - 19

  2. అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్ III - 47

  3. అసోసియేట్ ఇంజినీర్ గ్రేడ్ IV - 36

  4. అసోసియేట్ ఆఫీసర్ గ్రేడ్ II / ఇంజినీరింగ్ - 7

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి
డిప్లొమా/డీగ్రీ(సివిల్/మెకానికల్/వెల్డింగ్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.80,000 నుంచి రూ.1,12,000.

గరిష్ఠ వయోపరిమితి: 37 నుంచి 45 ఏళ్లు మించకూడదు. (నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 అక్టోబరు 19.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబరు 02.

Website: https://www.engineersindia.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram