సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్, సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 254

వివరాలు:

విభాగాలు: జనరల్, టెక్నికల్, ఫైనాన్స్ తదితరాలు..

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఏదైనా డిసిప్లిన్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.

వయోపరిమితి: 15.11.2026 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.850. అప్లికేషన్ ఫీజు + రూ. 500. ఇంటిమేషన్ ఛార్జీలు కలిపి మొత్తం రూ. 1,350. ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది, కానీ రూ. 500/- ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లించాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష (Online Test) + డాక్యూమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ వెయిటేజీ 85:15 నిష్పత్తిలో ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్షలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది (తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులు కోత ఉంటుంది).

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 17.10.2026

దరఖాస్తు చివరి తేదీ: 15.11.2026.

Website: http://www.cewacor.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram