బీఎంఆర్‌సీఎల్‌లో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు

బీఎంఆర్‌సీఎల్‌లో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్‌), ఆపరేషన్స్ అండ్‌ మెయింటెనెన్స్ వింగ్ లో మెట్రో స్టేషన్లు, డిపోలలో సెక్యూరిటీ విధులను నిర్వర్తించడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 50

అర్హతలు: టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండియన్ ఆర్మీ /నేవీ/ఇండియన్ ఎయిర్‌ఫోర్స్/కర్ణాటక స్టేట్ పోలీస్ డిపార్ట్‌మెంట్/సీఏపీఎఫ్‌/సీఆర్‌పీఎఫ్‌/బీఎస్‌ఎఫ్‌/సీఐఎస్ఎఫ్‌, ఇతర సమానమైన సర్వీసుల నుంచి పనిచేస్తున్న లేదా రిటైర్డ్ అయిన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: 62 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: నెలకు రూ.32,950 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: పోస్టు ద్వారా

చిరునామా: జనరల్ మేనేజర్ (హెచ్ఆర్‌), బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, III ఫ్లోర్, బీఎంటీసీ కాంప్లెక్స్, కేహెచ్‌. రోడ్, శాంతినగర్, బెంగళూరు.

దరఖాస్తు చివరి తేదీ: 31-10-2026

Website:https://projectrecruit.bmrc.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram