ఎన్‌టీపీసీ-అండర్‌ గ్రాడ్యుయేట్‌ 2026 నోటిఫికేషన్‌

ఎన్‌టీపీసీ-అండర్‌ గ్రాడ్యుయేట్‌ 2026 నోటిఫికేషన్‌

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 1,688 (సికింద్రాబాద్‌ జోన్‌లో 72 ఖాళీలున్నాయి)

వివరాలు:

  • నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌)

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 700

  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 200

  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 600

  • ట్రెయిన్స్ క్లర్క్: 188

అర్హత: లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి (+2 స్టేజ్) లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సర ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు కారు.

వయోపరిమితి: 18 నుంచి 30 మధ్య ఉండాలి.

ప్రారంభ వేతనం: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కు రూ.21,700; అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్‌కు రూ.19,900.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీటీ 1, 2), ధ్రువపత్రాల పరిశీలన, వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (1st Stage CBT): ఇది అందరికీ సాధారణమైన స్క్రీనింగ్ పరీక్ష. ఇందులో గణితం (30 ప్రశ్నలు), జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ (30 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు) కలిసి మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (2nd Stage CBT): మొదటి దశ సీబీటీలో సాధించిన మార్కుల నార్మలైజేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో గణితం (50 ప్రశ్నలు), రీజనింగ్ (35 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్ (35 ప్రశ్నలు) కలిసి మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. (గమనిక: ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్‌ను రద్దు చేయడం జరిగింది).
ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పరీక్ష ఫీజు: జనరల్ / యూఆర్‌/ ఇతర అభ్యర్థులు: రూ. 500 (మొదటి దశ సీబీటీకు హాజరైన తర్వాత, బ్యాంకు చార్జీలు మినహాయించి రూ. 400 వాపసు ఇవ్వబడుతుంది).
ఎస్సీ / ఎస్టీ / మాజీ సైనికోద్యోగులు / దివ్యాంగులు / మహిళలు / ట్రాన్స్‌జెండర్లు / మైనారిటీలు / ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC): రూ. 250 (మొదటి దశ పరీక్షకు హాజరైన తర్వాత ఈ పూర్తి ఫీజు బ్యాంకు చార్జీలు మినహాయించి వాపసు ఇస్తారు).

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15.10.2026

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.11.2026

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 15.11.2026

దరఖాస్తు సవరణ విండో తేదీలు: 16.11.2026 నుంచి 25.11.2026 వరకు (రూ. 250 ఫీజుతో)

Website: https://www.rrbapply.gov.in/#/auth/landing

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram