ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-57 జులై 2027 కోర్సు

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-57 జులై 2027 కోర్సు

భారత సైన్యం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-57) కోర్సు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ కోర్సు జులై 2027 నుంచి ప్రారంభమవుతుంది.

వివరాలు:

  • 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్‌-57)- జులై 2027

ఖాళీలు: 90.

అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో 10+2 లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ మెయిన్స్-2026కు హాజరై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2027 నాటికి 16.5 నుంచి 19.5 ½½ఏళ్ల మధ్య ఉండాలి. (అభ్యర్థులు 01 జనవరి 2008 కంటే ముందు, 01 జనవరి 2011 తర్వాత జన్మించి ఉండకూడదు)

వేతనం: మిలటరీ సర్వీస్‌ పే కింద స్టైపెండ్‌ నెలకు రూ.15,500. మూడేళ్ల శిక్షణ అనంతరం మూలవేతనం నెలకు రూ.56,100- రూ.1,77,500తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ప్రోత్సాహకాలు దక్కుతాయి.

ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

కోర్సు, శిక్షణ: మొత్తం నాలుగేళ్లు కోర్సు, శిక్షణ కొనసాగుతుంది.

ఇందులో ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, బీటెక్‌ టెక్నికల్‌ శిక్షణ మొదటి మూడేళ్లు సీఎంఈ పుణె, ఎంసీఈఎంఈ సికింద్రాబాద్‌లోని కేడెట్స్‌ ట్రైనింగ్‌ వింగ్స్‌(సీటీడబ్ల్యూ), మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో నిర్వహిస్తారు. తర్వాత ఏడాది పాటు దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో శిక్షణ కొనసాగుతుంది. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్‌ (బీఈ/ బీటెక్‌) డిగ్రీ అందజేస్తారు. తర్వాత లెఫ్టినెంట్‌ హోదాలో సైన్యంలో విధుల్లోకి తీసుకుంటారు.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: ప్రయాగ్‌రాజ్ (ఉత్తర ప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), లేదా జలంధర్ (పంజాబ్).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.11.2026.

Website: https://joinindianarmy.nic.in/Authentication.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram