ఏపీపీఎస్సీ- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు

ఏపీపీఎస్సీ- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ ఇంజినీరింగ్ సేవలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భార్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

ఏఈఈ (ఏపీ పబ్లిక్ హెల్త్ & మున్సిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్) (PH&ME): 21

ఏఈఈ (ఏపీ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్): 100

ఏఈఈ (ఏపీ రూరల్ వాటర్ సప్లై & శానిటేషన్ డిపార్ట్‌మెంట్): 73

ఏఈఈ (ఏపీ రోడ్లు & భవనాల శాఖ (సివిల్‌)): 75

ఏఈఈ (ఏపీ రోడ్లు & భవనాల శాఖ (ఎలక్ట్రికల్‌)): 04

ఏఈఈ (ఏపీ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ)): 06

ఏఈఈ (ఏపీ జలవనరుల శాఖ (సివిల్‌, మెకానికల్‌)): 224

అర్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా యూజీసీ/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ శాఖలో (సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్) బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. లేదా ఏఎంఐఈ (ఇండియా) పరీక్షలో సెక్షన్ "ఏ" & "బి" ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

జీతం: నెలకు రూ.57,100- రూ.1,47,760.

వయోపరిమితి: 01/07/2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కేవలం ఒకే దశలో ఆన్‌లైన్ (CBRT) విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు (స్క్రీనింగ్ టెస్ట్ లేదు). ప్రతి తప్పు సమాధానానికి నిర్దేశించిన మార్కులలో 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 02.11.2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22/11/2026.

Website:https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram