తెలంగాణ హౌసింగ్ బోర్డులో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు

తెలంగాణ హౌసింగ్ బోర్డులో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు

హైదరాబాద్‌లోని సీయూఆర్‌ఈ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్లు - అఫోర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం తెలంగాణ హౌసింగ్ బోర్డు (టీజీహెచ్‌బీ) తాత్కాలిక ప్రాతిపదికన (ఔవుట్‌సోర్సింగ్) అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) - 25

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు మల్టీస్టోర్డ్ రెసిడెన్షియల్ / ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. హైరైజ్ ప్రాజెక్ట్‌లు, ఈపీసీ పనులు, క్యూసీ/క్వాంటిటీ సర్వేయింగ్ / ఎస్టిమేషన్లలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
గరిష్ఠ వయోపరిమితి: 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 నుంచి 44 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.33,800.

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా, టీజీహెచ్‌బీ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం, ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 అక్టోబరు 21

Website: https://tghb.telangana.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram