క్యాబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు

క్యాబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన క్యాబినెట్ సెక్రటేరియట్‌ నుంచి డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) పోస్టులకు (ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌) నోటిఫికేషన్‌ వెలువడింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 210

వివరాలు:

కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 112
ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 112
డేటా సైన్స్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ / సంబంధిత స్పెషలైజేషన్లు: 10
ఫిజిక్స్: 5
మెకానికల్ ఇంజినీరింగ్: 4
సివిల్ ఇంజినీరింగ్: 3
కెమిస్ట్రీ: 2
మ్యాథమెటిక్స్: 1
స్టాటిస్టిక్స్: 1

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో గేట్‌ స్కోర్ కార్డు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో సాధించిన గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఒక సబ్జెక్ట్ కోడ్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

వయోపరిమితి: దరఖాస్తుల చివరి తేదీ నాటికి గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

వేతనం: అలవెన్సులతో కలిపి నెలకు సుమారు రూ.1,00,000.

ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టులో చెల్లుబాటు అయ్యే గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సాధారణ పోస్టు ద్వారా పోస్టు బ్యాగ్‌ నం.001, లోదీ రోడ్‌ హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, న్యూదిల్లీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 15.11.2026.

Website: https://cabsec.gov.in/more/vacancies/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram