ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 17

వివరాలు:

అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: 11

అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: 6

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

వేతనం: నెలకు రూ.48,440- రూ.1,37,220

వయోపరిమితి: 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు: 5 ఏళ్ల సడలింపు. దివ్యాంగులకు 10 ఏళ్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లు, అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష (CBRT) ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (CPT) నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌, అర్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య అర్హత తదితర నిబంధనల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలో పేపర్‌-1, 2, 3 ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ (150 మార్కులు), సబ్జెక్టు (150 మార్కులు), సబ్జెక్టు (150 మార్కులు), మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి సంబంధిత ప్రశ్న మార్కుల్లో మూడో వంతు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ప్రాసెంసిగ్‌ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120.ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, అర్హులైన నిరుద్యో అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 29.10.2026

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.

Website: https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram