మహబూబ్‌నగర్ జిల్లాలో మల్టీ పర్పస్ వర్కర్ ఉద్యోగాలు

మహబూబ్‌నగర్ జిల్లాలో మల్టీ పర్పస్ వర్కర్ ఉద్యోగాలు

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం ఆధ్వర్యంలో నేషనల్ ఆయుష్ మిషన్, ఔవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 08

వివరాలు:

  1. ఆయుష్ డాక్టర్ : 01

  2. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ : 02

  3. డైటీషియన్ : 01

  4. సైకోసోషల్ కౌన్సిలర్ : 01

  5. యోగా ప్రొఫెషనల్ : 01

  6. మల్టీ పర్పస్ వర్కర్ : 02

అర్హత: పోస్టును బట్టి 7వ తరగతి/డిగ్రీ/పీజీ(ఆయుర్వేద / యునాని / హోమియోపతి / న్యూట్రిషన్/ నాచురోపతి)లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01/07/2026 నాటికి కనీస వయసు 18 ఏళ్ల నుంచి
44 ఏళ్లు మించకూడదు.(నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రాంగణం (T.G.M.S.I.D డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం పక్కన), మహబూబ్‌నగర్ జిల్లా.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2026 అక్టోబర్ 22

Website:https://mahabubnagar.telangana.gov.in/recruitments/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram