నాబార్డ్‌లో కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు

నాబార్డ్‌లో కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్‌), ముంబయిలోని హెడ్ ఆఫీస్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 16

వివరాలు:

  • ఎస్‌ఓసీ- 03

  • ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్- 03

  • నెట్‌వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్- 01

  • ఈథికల్ హ్యాకర్ & పెనెట్రేషన్ టెస్టర్- 01

  • లీడ్ ఆడిటర్ - 02

  • సైబర్ & నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్-02

  • ఐటీ బ్యాంకింగ్ స్పెషలిస్ట్- 02

  • సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్- 02

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/పీజీ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 25 నుంచి 45 ఏళ్ల వరకు ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.)

జీతం: ఏడాదికి పోస్టును బట్టి రూ.. 12-18 లక్షలు నుంచి రూ.18-25 వరకు ఉంటుంది.

దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 150 (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే). మిగిలిన అభ్యర్థులందరికీ రూ.850.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 26.10.2026

Website:https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram