టీహెచ్‌డీసీలో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు

టీహెచ్‌డీసీలో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10

వివరాలు:

  1. సీనియర్‌ మేనేజర్‌: 04

  2. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 04

  3. అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌: 02

అర్హత: సంబంధిత విభాగాల్లో సీఏ/సీఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ మేనేజర్‌కు 48 ఏళ్లు; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 50 ఏళ్లు; అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌కు 53 ఏళ్లు మించకూడదు.

వేతనం: అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.1,20,000- రూ.2,80,000; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.లక్ష నుంచి రూ.2,60,000; సీనియర్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 07.10.2026.

దరఖాస్తు చివరి తేదీ: 06.11.2026.

Website:https://thdc.co.in/en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram