ఆర్‌ఆర్‌బీ - ఎన్‌టీపీసీ ఉద్యోగాలు

ఆర్‌ఆర్‌బీ - ఎన్‌టీపీసీ ఉద్యోగాలు

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరిస్‌ (గ్రాడ్యుయేట్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 3,548 (జనరల్‌-1517, ఎస్సీ-553, ఎస్టీ-300, ఓబీసీ-ఎన్‌సీఎల్‌- 873, ఈడబ్ల్యూఎస్‌- 305)

వివరాలు:

  1. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్: 127

  2. గూడ్స్ ట్రైన్ మేనేజర్: 2,750

  3. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 300

  4. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 371

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీలు:

అహ్మదాబాద్: 19

అజ్‌మేర్: 304

బెంగళూరు: 346

భోపాల్: 157

భువనేశ్వర్: 146

బిలాస్‌పూర్: 542

చండీగఢ్: 59

చెన్నై: 141

సికింద్రాబాద్: 56

గోరఖ్‌పుర్: 30

గువాహటి: 104

జమ్మూ-శ్రీనగర్‌: 66

కోల్‌కతా: 332

మాల్దా: 26

ముంబయి: 155

ముజఫర్‌పూర్‌: 78

పట్నా: 29

ప్రయాగ్‌రాజ్: 265

రాంచీ: 377

సిలిగురి: 291

తిరువనంతపురం: 25

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి విద్యార్హత పూర్తిచేసి ఉండాలి. తుది పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

వయోపరిమితి: 01-01-2027 నాటికి 18-33 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు గరిష్ఠ వయసులో 5 ఏళ్లు; ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. దివ్యాంగుల, ఎక్స్‌సర్విస్‌మెన్‌, రైల్వే ఉద్యోగులు తదితరులకు నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు ఉంటుంది.

వేతనం: ప్రారంభ వేతనం చీఫ్‌ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్‌కు రూ.35,400; గూడ్స్ రైలు మేనేజర్‌కు రూ.29,200; జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కు రూ.29,200; సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కు రూ.29,200.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత (సీబీటీ 1, 2) పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం:

సీబీటీ-1లో 100 ప్రశ్నలు, 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌ 40, మ్యాథమెటిక్స్‌ 30, జనరల్‌ ఇంటలీజెన్స్‌ & రీజనింగ్‌ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.
సీబీటీ-2లో 120 ప్రశ్నలు, 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌ 50, మ్యాథమెటిక్స్‌ 35, జనరల్‌ ఇంటలీజెన్స్‌ & రీజనింగ్‌ 35 ప్రశ్నలు ఉంటాయి. 1వ దశలో సాధించిన నార్మలైజ్‌డ్‌ మార్కుల ఆధారంగా 2వ దశకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

సీబీటీల్లో తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఒక్క అభ్యర్థి ఒక ఆర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే అప్లికేషన్స్‌ తిరస్కరిస్తారు.

పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/ట్రాన్స్‌జెండర్‌/మైనారిటీలు/ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500. సీబీటీ1కు హాజరైన అభ్యర్థులందరికి రీఫండ్‌ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల ప్రారంభం: 08-10-2026

దరఖాస్తుల చివరి తేదీ: 06-11-2026

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 08-11-2026

దరఖాస్తు సవరణల గడువు: 09-11-2026 నుంచి 18-11-2026

Website:https://www.rrbapply.gov.in/#/auth/landing

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram