నేషనల్ ఇన్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐసీఎల్‌), భారత ప్రభుత్వ రంగ సంస్థ, ఓపెన్ మార్కెట్ నుంచి స్కేల్-I క్యాడర్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్‌లు అండ్‌ స్పెషలిస్ట్‌లు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 321 పోస్టులు (జనరలిస్ట్: 200, స్పెషలిస్ట్: 121)

విభాగాలు: ఫైనాన్స్‌, లీగల్‌, ఐటీ, ఆటోమొబైల్‌ ఇంజినీర్స్‌, రిస్క్‌ఇంజినీర్స్‌, అగ్రికల్చర్‌, జనరలిస్ట్‌ ఆఫీసర్‌ తదితరాలు..

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీ, ఇంజినీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి.)

జీతం: నెలకు రూ.82,485 నుంచి రూ. 1,14,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ.250. ఇతర అభ్యర్థులందరికీ రూ.1000.

ఎంపిక విధానం: రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దశ 1: ప్రిలిమినరీ పరీక్ష- 100 మార్కులు

దశ 2: మెయిన్స్ పరీక్ష- 280 మార్కులు

పరీక్ష ఆబ్జెక్టివ్ టెస్ట్ విధానంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు(0.25) మార్కుల కోత ఉంటుంది.

దశ 3: ఇంటర్వ్యూ: మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు ప్రక్రయ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 08-10-2026

దరఖాస్తు చివరి తేదీ: 28-10-2026

Website:https://nationalinsurance.nic.co.in/recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram