ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (జూనియర్ డివిజన్‌)లో సివిల్ జడ్జి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (జూనియర్ డివిజన్‌)లో సివిల్ జడ్జి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) - 119 పోస్టులు

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లాడిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణతతో పాటు హైకోర్టు సర్వీస్, డిస్ట్రిక్ట్ జ్యుడీషియరీ, ప్రొసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖరారైన సభ్యుడిగా పనిచేస్తూ ఉండాలి.

వయోపరిమితి: 01.09.2026 నాటికి 35 ఏళ్లకు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520.

ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది.

  1. స్క్రీనింగ్ టెస్ట్ (Screening Test): కంప్యూటర్ ఆధారిత- 100 మార్కులు (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు). ఇందులో కనీసం 40% మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.

  2. రాత పరీక్ష: మొత్తం 3 పేపర్లు ఉంటాయి (ప్రతి పేపర్‌కు 100 మార్కులు): పేపర్-I: సివిల్ లాస్, పేపర్-II: క్రిమినల్ లాస్, పేపర్-III: ఇంగ్లీష్ (అనువాదం, వ్యాస రచన).

  3. మౌఖిక పరీక్ష (Viva-Voce / Interview): 50 మార్కులు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.750.

దరఖాస్తు చివరి తేదీ: 26.10.2026.

Website: https://aphc.gov.in/notifications.php?year=2026  

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram