ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో పోస్టులు

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో పోస్టులు

భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్‌) హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)-21 పోస్టులు

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన ఐటీఐ (ITI) నుంచి మోటార్ మెకానిక్‌లో సర్టిఫికేట్, ఏదైనా గుర్తింపు పొందిన మూడుళ్ల ప్రాక్టికల్ అనుభవం ఉండాలి. లేదా ఆటోమొబైల్ మూడేళ్ల డిప్లొమా ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు పే మ్యాట్రిక్స్ లెవెల్ - 4 ప్రకారం రూ.25,500 నుంచి రూ. 81,100 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ. 100/- చెల్లించాలి. ఎస్సీ/ మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: పీఈటీ, విద్యార్హత, రాత పరీక్ష, ప్రాక్టికల్ / స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షల ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 27.10.2026.

Website:https://itbpolice.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram