ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీఎసీ ఉద్యోగాలు

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీఎసీ ఉద్యోగాలు

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 3,477 పోస్టుల భర్తీకి సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ (ఎన్‌టీపీసీ) పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్‌లో గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు ఉంటాయి.

వివరాలు:

నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ (NTPC): 3,477 ఖాళీలు

అర్హతలు: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: పే లెవెల్‌ 5 & 6

వయోపరిమితి: 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08.10.2026

దరఖాస్తు చివరి తేదీ: 06.11.2026

గమనిక: ఎంపిక విధానం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలి.

Website:https://www.rrbapply.gov.in/#/auth/landing

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram