సీఆర్‌పీఎఫ్‌లో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు

సీఆర్‌పీఎఫ్‌లో స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు

కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) స్పోర్ట్స్ కోటా 2026 కింద హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి మెరిట్ కలిగిన క్రీడాకారుల (పురుషులు, మహిళలు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 521

వివరాలు:

హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) / కానిస్టేబుల్‌ జీడీ (స్పోర్ట్స్ కోటా): 182
పోస్టులు (పురుషులు: 150, మహిళలు: 32) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) / కానిస్టేబుల్‌ జీడీ (స్పోర్ట్స్ కోటా): 339 పోస్టులు
(పురుషులు: 258, మహిళలు: 81)

అర్హత: హెడ్ కానిస్టేబుల్ (GD): గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతర్జాతీయ పోటీలలో దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. లేదా నేషనల్ గేమ్స్/ఛాంపియన్‌షిప్‌లు/ఇంటర్-యూనివర్సిటీ టోర్నమెంట్‌లలో 1 నుంచి 3వ స్థానం సాధించి ఉండాలి.
కానిస్టేబుల్ (GD) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా ఖేలో ఇండియా / నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.

వయోపరిమితి: 01/08/2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి (అభ్యర్థులు 02/08/2003 కంటే ముందు, 01/08/2008 తర్వాత జన్మించి ఉండకూడదు). అన్‌రిజర్వ్‌డ్ క్రీడాకారులకు 5 సంవత్సరాలు; ఓబీసీ (NCL) అభ్యర్థులకు 8 సంవత్సరాలు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.

జీతం: హెడ్ కానిస్టేబుల్ (GD) పోస్టులకు రూ. 25,500 - రూ. 81,100. కానిస్టేబుల్ (GD)కు రూ. 21,700 - రూ. 69,100. దీనితో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, స్పోర్ట్స్‌ ట్రయల్‌ టెస్ట్‌, క్రీడా సర్టిఫికెట్లలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారీ, వైద్య పరీక్షలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష రుసుము: రూ. 100; మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 12.10.2026.

దరఖాస్తు చివరి తేదీ: 11.11.2026.

Website:https://rect.crpf.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram