ఏపీపీఎస్సీ- గ్రూప్‌-1 నోటిఫికేషన్‌

ఏపీపీఎస్సీ- గ్రూప్‌-1 నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ), గ్రూప్-I సర్వీసుల కింద వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 163

వివరాలు:

  1. ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) లో డిప్యూటీ కలెక్టర్లు: 11

  2. ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14

  3. ఏపీ పోలీస్ సర్వీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) కేటగిరీ-II: 36

  4. ఏపీ పోలీస్ సర్వీస్‌లో డిఎస్పీ (కమ్యూనికేషన్స్): 03

  5. ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్: 14

  6. ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్లు: 03

  7. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 01

  8. ఏపీ కోఆపరేటివ్ సర్వీస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్: 15

  9. ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12

  10. ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 02

  11. ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 03

  12. ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14

  13. ఏపీ పంచాయతీ రాజ్ సర్వీస్‌లో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 35

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. డీఎస్పీ (కమ్యూనికేషన్స్) కు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ / రేడియో ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు డిప్యూటీ కలెక్టర్స్‌, అసిస్టెంట్‌ కమీషనర్‌, డీఎస్‌పీ డీఈఓ పోస్టులకు రూ.61,960- రూ.1,51,370; ఆర్‌టీఓ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, పోస్టులకు రూ.57,100- రూ.1,47,760; డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు రూ.65360- రూ.1,54,980; ఇతర పోస్టులకు రూ.రూ.54,060- 1,40,540.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 825 మార్కులకు నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష): ఆఫ్‌లైన్ విధానంలో (ఓఎంఆర్‌ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్) ఉంటుంది. పేపర్-I (జనరల్ స్టడీస్ - 120 మార్కులు), పేపర్-II (జనరల్ ఆప్టిట్యూడ్ - 120 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

మెయిన్స్ రాత పరీక్ష: డిస్క్రిప్టివ్ పద్ధతిలో రెండు క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్లు (తెలుగు, ఇంగ్లిష్) ఐదు జనరల్ కోర్ పేపర్లు (ప్రతి పేపర్‌కు 150 మార్కులు) ఉంటాయి.

ఇంటర్వ్యూ: 75 మార్కులు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 06.10.2026

దరఖాస్తు చివరి తేదీ: 27.10.2026.

Website:https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram