జీజీహెచ్‌ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు 

జీజీహెచ్‌ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు 

కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో వివిధ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 9

వివరాలు: 

1. డాక్టర్/సైకియాట్రిస్ట్ - 1  

2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ - 1  

3. చౌకీదార్ - 2  

4. హౌస్ కీపింగ్ స్టాఫ్ (ఫుల్ టైమ్) - 1  

5. కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ - 2  

6. యోగా థెరపిస్ట్ / డాన్స్ టీచర్ / మ్యూజిక్ టీచర్ / ఆర్ట్ టీచర్ (పార్ట్ టైమ్) - 1  

7. పీర్ ఎడ్యుకేటర్ - 1  

విద్యార్హత: సంబంధిత పోస్టును బట్టి ఎంబీబీఎస్ (MBBS), సోషల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్, పదవ తరగతి (SSC) ఉత్తీర్ణత & సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి 42 ఏళ్లు (01.07.2026 నాటికి). ఎస్సీ, ఎస్టీ, బీసీ & ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. 

జీతం (నెలకు): పోస్టును బట్టి రూ.5,000 నుంచి రూ.60,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు కడప జిల్లా అధికారిక వెబ్‌సైట్ (https://kadapa.ap.gov.in) నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో పాటుగా సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కడప వారికి నేరుగా సమర్పించాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 04.06.2026.  

దరఖాస్తు రుసుము: ఓపెన్ కాటగిరీ (OC) అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రూ.300 (కన్వీనర్, హెచ్‌డీఎస్, జీజీహెచ్, కడప పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి).  

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2026 సాయంత్రం 5 గంటల వరకు. 

Website: https://kadapa.ap.gov.in/notice_category/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram