ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్ 

ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్ 

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ‘ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (ఏపీటెట్‌ జూన్‌ -2026) నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ అండ్‌ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు ఈ పరీక్ష తప్పనిసరి. 

వివరాలు:

అర్హత పరీక్ష పేరు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్‌ జూన్‌ -2026).  

విద్యార్హతలు: అభ్యర్థులు కనీసం 40 నుంచి 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, డీఈఎల్ఈడీ (D.El.Ed), బీఈడీ (B.Ed) లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. (పూర్తి వివరాలు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో చూడాలి).

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్‌సైట్ cse.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  

దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-06-2026.  

దరఖాస్తు రుసుము: ప్రతి పేపర్‌కు (Paper-1A, 1B, 2A, 2B) విడివిడిగా రూ. 1000/- చెల్లించాలి.  

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఎంపిక ఉంటుంది. టీచర్ రిక్రూట్‌మెంట్‌లో టెట్ స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.  

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పేపర్-1A/1B & పేపర్-2A/2Bలకు సంబంధించి స్ట్రక్చర్, కంటెంట్ వివరాలు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఉన్నాయి.  

సిలబస్: వివరాలు అధికారిక వెబ్‌సైట్ cse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

మొత్తం మార్కులు: 150 మార్కులు.  

పరీక్ష కేంద్రాలు: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో ఉంటాయి. అవసరమైతే పొరుగు రాష్ట్రాల్లో కూడా కేటాయించవచ్చు.  

దరఖాస్తు చివరి తేదీ: 05-07-2026.  

పరీక్ష తేదీలు: 05-08-2026 నుంచి 21-08-2026 వరకు. (ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది).  

హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 25-07-2026 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రాథమిక కీ విడుదల: 24-08-2026.

ప్రాథమిక కీపై అభ్యంతరాలు: 25-08-2026 నుంచి 31-08-2026 వరకు స్వీకరిస్తారు.  

తుది కీ తేదీ: 08-09-2026.  

ఫలితాల విడుదల తేదీ: 15-09-2026.

Website: https://tet2dsc.apcfss.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram