ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకం మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతుంది.  

వివరాలు:

అసిస్టెంట్‌ (సెక్యూరిటీ): 62

అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 55 నుంచి 60 శాతం మార్కులతో ఉత్తర్ణత ఉండాలి. స్థానిక భాష, హిందీ, ఇంగ్లిష్‌లో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 

వయోపరిమితి: 01.06.2026 నాటికి వయస్సు 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్లకు 5 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.21,000 - రూ.22,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 జూన్‌ 11.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జులై 2.

Website:https://aaiclas.aero/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram