బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు

భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా, వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రెగ్యులర్ ప్రాతిపదికన క్లరికల్ క్యాడర్‌లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 30.

వివరాలు: 

మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ రిక్రూట్‌మెంట్ (క్లెరికల్ క్యాడర్ - కస్టమర్ సర్వీస్ అసోసియేట్)

క్రికెట్: 09

కబడ్డీ: 11

టేబుల్ టెన్నిస్: 02

ఫుట్‌బాల్: 08

అర్హత: భ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు, జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలలో దేశానికి లేదా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లు/ఖేలో ఇండియా గేమ్స్‌లో పతకాలు సాధించి ఉండాలి. అభ్యర్థి ప్రస్తుతం యాక్టివ్ స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.24,050- రూ.64,480 (+ఇతర అలవెన్సులు).

వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఫీల్డ్ ట్రయల్స్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.850; ఎస్సీ/ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.175.

దరఖాస్తు చివరి తేదీ: 12.05.2026.

Website:https://bankofindia.bank.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram